కోస్టల్‌ కారిడార్‌ నిర్మాణ వ్యతిరేక కమీటి ఆధ్వర్యంలో జాతీయ సదస్సు

సీతంపేట : కోస్టల్‌ కారిడార్‌ నిర్మాణ వ్యతిరేక కమీటి ఆధ్వర్యంలో నగరంలోని రామాటాకీస్‌ రోడ్డులోని అంబేంద్కర్‌భవన్‌లో రెండు రోజుల జాతీయ సదస్సు ఈ రోజు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్‌ జి హరగోపాల్‌ మాట్లాడుతూ విధ్వంసకర అభివృద్దిని అందరూ వ్వతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రజల కేంద్రంగా అభివృద్దికై అందరూ ఐక్యంగా పోరడాలన్నారు. అనంతరం గంగవరం, సోంపేట, కాకరాపల్లి, ప్రాంతాల్లో జరిగిన పోరటాల్లో అసువులు బాసిన అమరుల అత్మశాంతి కోసం ప్రతినిధులు మౌనం పాటించారు.