క్రమంగా నిండుతున్న కిన్నెరసాని

ఖమ్మం, జూలై 25 : జిల్లాలోని పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్‌ నీటి మట్టం బుధవారం మధ్యాహ్నానికి 398.7 అడుగులు (6.554 టీఎంసీలు) చేరుకుంది. గుండాల, ఇల్లందు మండలాల్లో కురిసిన వర్షాలకు 796.5 అడుగుల నుంచి 398.7 అడుగులకు నీటి మట్టం చేరింది. ఇటీవల కురిసిన వర్షాలకు రెండు అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. గత ఏడాదితో కిన్నెరసాని రిజర్వాయర్‌లో నీటి మట్టం కంటే ఈ ఏడాది రెండు అడుగుల నీటి మట్టం తక్కువగా ఉంది. గత ఏడాది ఇదే తేదీ నాటికి కిన్నెరసానిలో 400.1 అడుగుల నీటి మట్టం ఉంది. కిన్నెరసాని రిజర్వాయర్‌లో నీటి మట్టం 398 అడుగులకు చేరితే వ్యవసాయానికి నీటిని వదులుతారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో ఉన్న నీటి మట్టంతో కేటిపిఎస్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు.