క్రికెట్‌ శిక్షణా శిబిరం

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 17, (జనంసాక్షి):
యైటింక్లయిన్‌కాలనీ అబ్దుల్‌ కలాం క్రీడామైదానంలో జిల్లా క్రికెట్‌ శిక్షణా శిబిరంను ఆదివారం ఆర్జీ-2 జీఎం ఆంటోని రాజా ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ శిక్షణా శిబిరంలో డివైజీఎం హైదర్‌అలీ, మేనేజర్‌ కిరణ్‌కుమార్‌లు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఈ శిక్షణా శిబిరాన్ని ప్రతి ఒక్క క్రీడాకారుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోచ్‌ పింగిళి కృష్ణారెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు