క్రీడాకారిణి లీజెరుయ్‌పై విజయం సాధించిన సింధు

బీజింగ్‌: భారతీయ షట్లర్‌ పి.వి. సిధు ఈరోజు లండన్‌ ఒలింపిక్స్‌ బంగారు పతక గ్రహీత అయిన చైనా క్రీడాకారిణి లీ జెరుయ్‌పై విజయం సాధించి అందరినీ అబ్బురపరిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 24 వ స్థానంలో ఉన్న సింధూ చైనాలో జరుగుతున్న సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంటులో మహిళల సింగిల్స్‌లో సెమిఫైనల్స్‌కు చేరుకుంది. 45 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా జరిగిన పోటీలో సింధు 21-19-, 21-16 పాయింట్లతో గెలుపొందింది.