క్వార్టర్‌ ఫైనల్‌కు మేరీకోమ్‌

లండన్‌: బాక్సింగ్‌లో భారత్‌కు పతకంపై ఆశలు చిగురిస్తున్నాయి. స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ ఆదివారం క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. మహిళల ప్లై వెయిట్‌ ప్రిక్వార్టర్స్‌లో పోలండ్‌ బాక్సర్‌ కరోలినా మిచాల్టుక్‌పై 19-14తో మేరీకోమ్‌ విజయం సాధించింది.