*క్షయ వ్యాధిపై ప్రత్యేక వైద్య శిబిరం*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్(02):* మండల పరిధిలోని తాడిపర్తి, చెన్నూరు, గ్రామాలలో శుక్రవారం క్షయ వ్యాధిపై ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ మంజుల తెలిపారు అనంతరం ఆమె మాట్లాడుతూ తాడిపర్తి చెన్నూర్ గ్రామాలలో 44 మంది క్షయ వ్యాధి అనుమానితుల ను గుర్తించి వారి యొక్క తేమడ శాంపిల్స్ సేకరించి జిల్లా ల్యాబ్ కు పంపినట్లు ఆయన తెలిపారు ఎవరికైనా క్షయ వ్యాధి నిర్ధారణ అయితే ఆరు నెలలు పాటు తప్పకుండా మందులు వాడితే నివారించవచ్చని వారన్నారు క్షయ వ్యాధి బాధితులు మంచి పౌష్టికాహారం తీసుకోవడానికి ప్రభుత్వం నుండి ఆరు నెలల పాటు ప్రతినెల 500 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని రెండు వారాలకు నుంచి దగ్గు, రాత్రిపూట జ్వరం బరువు తగ్గడం తగ్గినప్పుడు తెమడలో రక్తం ఉంటే క్షయ వ్యాధిగా అనుమానించి పరీక్ష చేయించుకోవాలని ప్రజలకు సూచించారు అదేవిధంగా 2025 సంవత్సరం వరకు భారతదేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మించాలని ప్రభుత్వ ధ్యేయమని క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ క్లేవిన్ మార్క్, ఆరోగ్య విస్తరణ అధికారి సురేష్ కుమార్, సూపర్వైజర్ సుచిత్ర, ఏఎన్ఎంలు శోభారాణి, నాగలక్ష్మి, లక్ష్మి ,మాధవి, ఆశా కార్యకర్తలు ల్యాబ్ టెస్టింగ్ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు