క్షేమంగా తిరిగివచ్చిన చైనా వ్యోమగాములు

బీజింగ్‌: చైనాకి చెందిన తొలి మహిళ వ్యోమగామి, మరో ఇద్దరు వ్యోమగాములు 13రోజుల అంతరిక్షయాత్ర ముగించుకుని ఈరోజు క్షేమంగా తిరిగివచ్చారు. విజయవంతంగా ముగిసిన ఈ ప్రాజెక్టు  భవిష్యత్తులో అంతరిక్షానికి సంబంధించి చైనా చేపట్టే బృహత్‌ కార్యక్రమాలకు నాంది అని చైనా ప్రభుత్వం పేర్కొంది. మంగోలియా ప్రాంతంలో వ్యోమగాములు సురక్షితంగా భూమి మీద దిగడం దగ్గరనుంచి వారు వాతావరణ  మార్పులకు అలవాటుపడి, తేరుకుని నవ్వుతూ మాట్లాడడం వరకూ మొత్తం కార్యక్రమాన్ని చైనా టీవీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.