ఖమ్మం: గురుకుల ప్రిన్సిపాల్‌పై పోలీసులకు ఫిర్యాదుv
నేలకొండపల్లి : ఇంటర్ ప్రఽథమసంవత్సరం విద్యార్ధినిని చితకబాదిన కేసులో గురుకుల ప్రిన్సిపాల్‌పై విద్యార్ధిని తండ్రి నాగబాబు సోమవారం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. వివరాల ప్రకారం… తండ్రి ఇచ్చిన బ్రెడ్ తిన్నందుకు విద్యార్ధిని రాయబారపు రోహిణిని ఈనెల 2వ తేదీన గురుకుల ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మి చితకబాదినట్టు ఆమె తండ్రి నాగబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. విద్యార్ధినిని చితకబాదిన విషయమై సోమవారం ఆమె తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ను గురుకుల కళాశాలలో నిలదీశారు. మండల విద్యాధికారి యాలమూడి రవీందర్ సమక్షంలో ఏదో ఆవేశంలో రెండు దెబ్బలు కొట్టానని ఒప్పుకున్నట్టు తెలిసింది. వైద్యం చేయిస్తానని తల్లిదండ్రులకు చెప్పగా, అవసరంలేదు… తామే చేయించుకుంటామని చెప్పి రోహిణిని ఇంటికి తీసుకెళ్ళారు. అనంతరం ప్రిన్సిపాల్‌పై స్ధానిక పాలీస్‌స్టేషన్‌లో నాగబాబు ఫిర్యాదుచేశాడు.