ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలి.

 జిల్లా పాలనాధికారి నిఖిల
 వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి సెప్టెంబర్ 1
     ఖాతాదారులకు బ్యాంక్ ద్వారా మెరుగైన సేవలు అందించి బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులకు సూచించారు. గురువారం వికారాబాద్ పట్టణములో కొత్తగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు.  జిల్లాలో మొదటిసారిగా వికారాబాద్, తాండూర్ పట్టణాలలో రెండు పంజాబ్ నేషనల్ బ్యాంకులను  ప్రారంభించారు.  ఈ సందర్బంగా బ్యాంకర్లు ఖాతాదారులతో సమావేశం నిర్వహించి 5 కోట్ల రుణాలను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో యల్ డి యం రాంబాబు, పంజాబ్ బ్యాంక్ జోనల్ మేనేజర్ మొహమ్మద్ మక్సూద్ అలీ, సర్కిల్ మేనేజర్ ఎన్ వి ఎస్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.