ఖాన్ కుమార్తె పెళ్లి విందులో దారుణం
తాలిబన్ వ్యతిరేక నేతపై మానవబాంబు దాడి అఫ్గాన్‌లో అహ్మద్ఖాన్సహ 23 మంది దుర్మరణం
ఖాన్ కుమార్తె పెళ్లి విందులో దారుణం
మాజారేషరీఫ్: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ వ్యయాతిరేక రాజకీయ నేత అహ్మద్ ఖాన్ సమన్గని మానవబాంబు చేతిలో దారుణహత్యకు గురయ్యారు. శనివారం సమన్‌గన్ ప్రావిన్స్‌లో అహ్మద్ కుమార్తె పెళ్లి విందులో జరిగిన ఈ ఘటనలో మరో 22 మంది కూడా రుర్మరణం చెందారు. ప్రమాఖ నేతచ చట్టసభ సభ్యుడు అహ్మద్‌ఖాన్‌ను ఆలింగనం చేసుకున్న మానవబాంబు లనను తాను పేల్చుకున్నాడు. ఈ పేలుడు మృతుల్టో ఈ రాఫ్ట్ర నఘూ అధినేత, మరో సీనియర్ పోలిసు అధికారి కూడా ఉన్నారు. ఈ ఘటనలో 60 మంది గాయపడ్డారని అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తెలిపారు. అఫ్గాన్ శత్రువులు మరోసారి ఈ దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు తెలిపారు. విందుకు వచ్చే అతిధులను భద్రతా తనిఖీల పేరుతో ఇబ్బంది పెట్టొద్దన్న అహ్మద్ సూచనే కొంపముంచిదని భవిస్తున్నారు. అయితే, ఈ దాడితొ తమకు సంబంధంలేదని తాలిబన్లు పేర్కొన్నారు. ఎక్కువ పౌరనష్టం జరిగిన ఘటన విషయంలో తాలిబన్లు దాటవేత ప్రకటనలు చేయడం పరిపాటి. అహ్మద్ ఖాన్ 1980ల్లో సోవియట్స్కు వ్యతిరేకంగా పోదాడారు. ఆ తర్వాత తాలిబన్లకు వ్యతిరేవంగా పోరు సలిపారు. శనివారం జరిగిన మరో ఘటనలో కాందహర్లో ఓ పోలీసును దుండగులు కాల్చిచంపారు.