ఖాళీగా ఉన్నా ఉద్యోగాలు భర్తీచేయాలి: నారాయణస్వామి

చెన్నై: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సంస్థలలో రెండు కోట్ల ఫైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉందని ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి వి. నారాయనస్వామి తెలిపారు. బ్యాంకింగ్‌ సెక్టారుల నుంచి సీబీఐ వరకు రెండు కోట్ల పైచిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిని భర్తీ చేసే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం ఎస్‌ఎస్‌సీ లక్షపైచిలుకు నియామకాలను చేపడుతోందని వెల్లడించారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించే విధంగా సౌకర్యం కల్పించామని ప్రస్తుతం 55 శాతం మందికి ఇది అందుబాటులో ఉందని దీన్ని పూర్తిస్థాయిలో విస్తరించే విధంగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.