ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులను భర్తీ చేయాలి

ఆదిలాబాద్‌, జూలై 29 : ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో ఖాళీగా ఉన్న పీఈటీి, పీడీ పోస్టు భర్తీలో క్రీడాకారులైన గిరిజన అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించాలని జాతీయ స్థాయి క్రీడాకారులైన కృష్ణ, శ్రీనివాస్‌, గోపాల్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఐటీడీఏ ఏపీఓ వెంకటేశ్వర్లకు వినతి పత్రాన్ని అందజేసామని వారు పేర్కొన్నారు. మిగత పోస్టుల లాగా ఈ పోస్టులకు టెట్‌ అర్హత మార్కులు లేవని వాటి స్థానంలో బిపిఈడితో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన క్రీడాకారులకు వెయిటేెజి ఇస్తే తమకు న్యాయం జరుగుతుందని వారు విజ్ఞప్తి చేశారు. కొంత మంది ఎలాంటి క్రీడా అనుభవం లేకుండా మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో శిక్షణ సర్టిఫికెట్లు తెచ్చుకొని ఉద్యోగాలు పొందడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ వినతిని పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.