గంగదేవిపల్లిని స్పూర్తిగా తీసుకుంటాం

గీసుకొండ: ఆదర్శగ్రామామైన గంగదేవిపల్లిని స్పూర్తిగా తీసుకొని తమ దేశాల్లో ప్రచారం చేస్తామని విదేశీయులు పేర్కొన్నారు వరంగల్‌ జిల్లాలోని గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లిని బాలవికాస్‌ స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో నేపాల్‌, శ్రీలంక, ఇటలీ, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌, బంగ్లాదేశ్‌, చైనా, ఉంగండా, బోర్డాన్‌, ఆఫ్గనిస్థాన్‌, మాల్డీవులు, థాయ్‌లాండ్‌ దేశాలకు చెందిన 28మంది ప్రతినిధులతో కూడిన బృందం సందర్శించింది. ఈ సందర్భంగా వారు గ్రామంలో తిరిగి అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో గ్రామంలోని వివిధ కమిటీల సాయంతో గ్రామం అభివృద్ధి చెందిన తీరుపై మాజీ సర్పంచ్‌ రాజమౌళి, ప్రముఖకవి జీడికంటి శ్రీనివాసమూర్తి, పూసం లింగయ్య, బాలవికాస్‌ ఈడీ సింగారెడ్డి సౌరెడ్డిలు వివరించారు. సంపూర్ణమద్యనిషేదం, వందశాతం మరుగుదొడ్లు, ప్రభుత్వ పథకాల సద్వినియోగం, ప్లాస్టిక్‌ నిషేదం, కుటుంబసంక్షేమం, గ్రామభవిస్యత్తు పథకాల సద్వినియోగం, ప్లాస్టిక్‌ నిషేదం, కుటుంబసంక్షేమం, గ్రామభవిష్యత్తు ప్రణళికల గురించి వారు అడిగి తెలుసుకున్నారు. చిన్న గ్రామమైన దేశంలోనే ఆదర్శంగా నిలిచినందుకు వారు అభినందించారు.