గంగా మాత అందరిని చల్లగా చూడాలి

*రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 22:: గంగా మాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండించి అన్ని వర్గాల ప్రజలను చల్లగా చూడాలని ప్రార్థించినట్లు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి పేర్కొన్నారు మున్సిపల్ కేంద్రమైన తూప్రాల్లో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగా మాతకు బోనాలు సమర్పించిన సందర్భంగా ఆయన గంగామాతను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని వారు దేవుని కృషి వల్ల గంగా మాత ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉంటున్నారని అన్నారు చెరువులు కుంటలు ప్రతి సంవత్సరం నిండుకోవడంతో కెసిఆర్ ప్రభుత్వ అండదండలతో చెరువులలో ఉచితంగా చేపి పిల్లలను గత మూడున్నర సంవత్సరాలుగా పంపిణీ చేస్తున్నామని దీనితో గంగపుత్ర సంఘాలు ముద్ర సంఘాలు చేపల వ్యాపారంలో నిమగ్నమై ఆర్థికంగా ఉన్నారని అన్నారు
గంగా మాత కు బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గంగ పుత్రా మహిళలు గంగామాతకు భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున అమ్మా వారికి బోనాలు సమర్పించారు.శివసత్తుల పూనకాలతో మహిళలు గంగామాతకు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.బక్తూలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. గంగపుత్ర సంఘం నాయకులు దేవేందర్ తూప్రాన్ మండల జడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్ , కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్, కోడిప్యాక నారాయణ గుప్తా,మామిండ్ల క్రుష్ణ, మామిడి వెంకటేష్ ,సత్యలింగం గంగా మాత కు ప్రత్యేక పూజలు నిర్వహించారు , మన్నె శ్రీనివాస్,కుమ్మరి, రమెశ్, సతీశ్ చారి , లక్ష్మన్, శ్రీనివాస్, తిమ్మాపురం నరసింహులు,రహిమ్ ఆంజనేయులు, నర్సింహులు,గంగా పుత్ర సంఘం నాయకులు , కొటి,గనేష్,
శంకర్, యాదగిరి, నర్సింగ్, ధర్మేశ్, భిక్షపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.