గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి.
సిఐ జార్జ్
అల్లాదుర్గం, జనంసాక్షి ఆగష్టు 26
గణేశ్ నవరాత్రోత్సవాలను ప్రజలు, భక్తులు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అల్లాదుర్గం సీఐ జార్జీ సూచించారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన గణేశ్ నవరాత్రోత్సవాల శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని అన్నారు. నిమజ్జనం రోజున డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు అంజియాదవ్ ,ఎస్ ఐ ప్రవీణ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఆధికారులు, గణేశ్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.