గతంలో ఉన్న భద్రతా సిబ్బందినే తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ : శంకర్‌రావు

హైదరాబాద్‌: తన భద్రతా సిబ్బందిని మార్చడంపై మాజీ మంత్రి పి.శంకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రాణలకు హాని కలిగేలా ప్రభుత్వం వ్వవహరిస్తోందన్నారు. తనకు ఏదైన జరిగితే ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపిలే బాధ్యులవుతారని, వారిని ప్రాసిక్యూట్‌ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. శంకర్‌రావు విలేకరులతో మాట్లాడారు. మంత్రిగా ఉన్నప్పుడే తనకు బెదిరింపు ఫోన్లు వచ్చాయన్నారు. ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీలకు ఇప్పటికే లేఖలు రాసినట్లు తెలిపారు. గతంలో ఉన్న భద్రతా సిబ్బందినే తిరిగి తనకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.