గన్‌పార్క్‌ దగ్గర టీజేఏసీ కొవ్వొత్తుల ప్రదర్శన

హైదరాబాద్‌: ఉద్యమస్ఫూర్తి దినం సందర్భమైన డిసెంబర్‌ 9 సందర్భంగా టీజేఏసీ గన్‌పార్క్‌ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీజేఏసీ నేతలు, ఈటెల రాజేందర్‌, నాగం జనార్థన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు హాజరై అమరవీరులకు నివాళులర్పించారు. డిసెంబర్‌ 9 ప్రకటనను అమలు చేయాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు.