గన్‌పార్క్ వద్ద ఐకాస నేతల మౌన దీక్ష
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో మౌనదీక్ష ప్రారంభమైంది. నగరంలోని గన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పెద్ద సంఖ్యలో తెలంగాణ వాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐకాస నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోపక్క తెలంగాణలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి సామూహిక దీక్షలు చేపట్టింది.