గర్ల్స్ కాలేజ్ సమస్య పరిష్కారం చేయకపోతే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తాం
జనం సాక్షి ప్రతినిధి మెదక్ 2-9-2022*
జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ముందున్న మురికి కాలువ సమస్యను పరిష్కారం చేయాలని శుక్రవారం రోజున క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గారు
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ..
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ముందున్న కిరణ షాపుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమ్మాయిలు అలాగే మురికి కాలువ వాసనకు విద్యార్థులు టీచర్లు క్లాస్ రూముల్లోనే వాంతులు చేసుకుంటున్నారని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ గారి కూడా తెలియజేసిన పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత నాలుగు నెలలుగా జిల్లా అధికారుల ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారు కానీ కళాశాల సమస్యను పరిష్కారం చేయడం లేదని అన్నారు కళాశాల సమస్యను పరిష్కారం చేయాలని కళాశాల విద్యార్థులు వర్షంలో వెళ్లి కలెక్టర్ గారి కూడా వినతి పత్రం అందజేసిన స్పందించ లేకపోయారు అలాగే కళాశాల చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం వల్ల ఆ మురికి కాలువ చుట్టూ పందులు పశువులు తిరుగుకుంటూ కళాశాల లోపల వస్తున్నాయని విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారనీ మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పినా ఏలాంటి స్పందన లేకుండా పోయింది అన్నారు అలాగే రాత్రి వేళలో కొంతమంది వ్యక్తులు కళాశాల లోపాలకు వెళ్లి డ్రింక్స్ చేస్తు అక్కడే తాగిన సీసాలను కూడా పగలగొట్టి వెళ్తున్నారని కలెక్టర్ గారికి కూడా చెప్పిన ఎటువంటి చర్యలు తీసుకోలేదు విద్యార్థులు ఉదయం కళాశాలకు వెళ్లగానే విద్యార్థుల కాళ్లకు కోసుకుంటున్నా పట్టించుకోకు పోవడం దుర్మార్గం అని అన్నారు కళాశాల నిర్మాణం కూడా పూర్తిగా కాకపోవడం వల్ల విద్యార్థులకు సరిపడా గదులు లేక బయట కూర్చోబెట్టి చదువు చెప్పే పరిస్థితికి దిగజారాబోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి విద్యార్థుల సమస్యలపై సమక్ష చేసి మురికి కాలువ సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల రాబోయే కాలంలో విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున క్యాంప్ ఆఫీసు ముట్టడి చేపడతామని హెచ్చరించారు