గవర్నర్‌తో తెలంగాణ ఎంసీల సమావేశం

హైదారాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం ముగిసింది. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి విషయంతో జరుగుతున్న జాప్యాన్ని  వివరించినట్లు వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు  సహకరించాలని గవర్నర్‌ను కోరినట్టు ఎంపీలు  వెల్లడించారు. తెలంగాణపై వ్యతిరేకించే వారితో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు అన్నారు.