గవర్నర్‌తో సీఎం సుధీర్ఘ భేటి

ధర్మాన రాజీనామా.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చ
హైదరాబాద్‌, ఆగస్టు 27 (జనంసాక్షి) : రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ నరసిం హన్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మంత్రి ధర్మాన రాజీనామా, విద్యుత్‌ సమస్యలపై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు గంటన్నరపాటు ములాఖాత్‌ అయిన వీరు, సమావేశం అనంతరం భేటీ వివరాలను బయటికి చెప్పకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాల పరిష్కారం దిశగా రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరగవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.