గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన బీజేపీ ప్రతినిధి బృందం

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ను బీజేపీ ప్రతినిధుల బృందం కలిసింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు అక్బరుద్దీన్‌ వ్యాఖ్యల సీడీలు గవర్నర్‌కు అందజేశారు. మత సామరస్యంను దెబ్బతీసె విధంగా అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.