గాంధీభవన్‌లో క్రాంతిదివస్‌!

హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి):గాంధీభవన్‌లో క్రాంతి దివస్‌ వైభవంగా ప్రారంభమైంది. క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం గాంధీభవన్‌లో పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా క్రాంతి దివస్‌ నేపథ్యంలో గాంధీ భవన్‌ను అందంగా ముస్తాబు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన నేతలందరూ గాంధీ టోపీ ధరించడం అందర్నీ ఆకట్టుకుంది. గాంధీభవన్‌కు చేరుకున్న పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు.