గాంధీ ఆస్పత్రిలో జూడాల ర్యాలీ

హైదరాబాద్‌: తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గాందీ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. సరైన వైద్యం అందించలేదని ఆరోపిస్తూ ఒక రోగి బంధవులు ఈరోజు సాయంత్రం గాంధీ ఆస్పత్రిపై దాడి చేసిన సంగతి తెలిసిందే.