గాలి బెయిల్‌ కుంభకోణం కేసులో బళ్లారి బయల్దేరిన సీబీఐ, ఏసీబీ బృందం

హైదారాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణం కేసులో అధికారులు దర్యాప్తు మమ్మరం చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం సీబీఐ, ఏసీబీ సంయుక్త బృందం బళ్లారి వెళ్లింది. ఈ బృందం బళ్లారిలోని గాలి, అనుచరుల బ్యాంకు ఖాతాల లావాదేవీలను పరిశీలిస్తోంది. దర్యాప్తులో బాగంగా గాలి సన్నిహితులను కూడా ప్రశ్నిస్తుంది.