గాలి బెయిల్‌ కేసులో నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌ రెడ్డి బెయిల్‌ కేసులో నిందితులైన జడ్జీలు ప్రభాకరావు, లక్ష్మీనరసింహారావులను అధికారులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వారిద్దరికీ న్యాయస్థానం ఆగస్టు 9వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగించింది. అధికారులు తిరిగి వారిద్దరినీ చర్లపల్లి జైలుకు తరలించారు.