గాలి బెయిల్‌ కేసులో మరో మలుపు

గాలి బెయిల్‌ విషయమై పట్టాభి కంటే ముందే మరో న్యాయమూర్తిని గాలి అనుచరులు సంప్రదించినట్లు యాదగిరి వాంగ్మూలంలో సీబీఐకి తెలిపినట్లు సమాచారం. మే 27 న సీబీఐ యాదగిరి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. గాలి సోదరుడు సోమశేఖర్‌రెడ్డిని సీనియర్‌ న్యాయవాది ఉమా మహేశ్వర రావు పరిచయం చేశారని యాదగిరి తెలిపాడు. సోమశేఖర్‌రెడ్డి పరిచయం అనంతరం చలపతిరావుతో కలిసి గాలి బెయిల్‌ ఒప్పందం కుదుర్చుకున్నారని అతను తెలిపాడు. పట్టాభి రామారావు తో ఒప్పందం చర్చించామన్నాడు. గాలి జనార్ధన్‌రెడ్డి సోమశేఖర్‌రెడ్డిలు ఓసారి మాట్లాడుతూ
శర్మ అనే వ్యక్తిని సంప్రదించాలని కోరారని బెయిల్‌ విషయమై మాట్లాడేందుకు వైజాగ్‌లో తన సోదరుడిని సంప్రదించాలని జడ్జి శర్మ చెప్పారన్నాడు. శర్మ సోదరుడికి డబ్బు ముట్లజెప్పినప్పటికీ గాలి జనార్ధన్‌రెడ్డి కె బెయిల్‌ రాలేదని ఆ తర్వాత చలపతిరావును సంప్రదించి మరోసారి గాలి బెయిల్‌ విషయమై మాట్లాడామని యాదగిరి చెప్పాడు. సోమశేఖర్‌రెడ్డి దశరథ రామిరెడ్డి సురేష్‌ బాబుతో కలిసి 7 బ్యాగుల్లో చలపతిరావుకు డబ్బులు ఇచ్చామన్నాడు. గాలి బెయిల్‌ మొత్తం ఒప్పందంలో రూ. 9.50 లక్షలు తనకు ముట్టాయని యాదగిరి సీబీఐ కి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పాడు.