గాలి బెయిల్‌ కేసు నిందితులకు 24 వరకు రిమాండ్‌

హైదరాబాద్‌: గాలి జనార్థనరెడ్డి బెయిల్‌ కేసులో నిందితులుగా ఉన్న పట్టాభిరామారావు, ఆయన కుమారుడు రవిచంద్ర, బళ్లారి ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే సురేష్‌బాబు, దశరథరామిరెడ్డి, జూనియర్‌ న్యాయవాది ఆదిత్యత రిమాండ్‌ను ఏసీబీ కోర్టు ఈ నెల 24 వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు వీరిపై ఈ నెల 13న ఏసీబీ దాఖలు చేసిన అభియోగపత్రాన్ని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.