‘గాలి’ బెయిల్‌ స్కాంలో కర్నాటక ఎమ్మెల్యే సురేష్‌బాబు అరెస్టు

హైద్రాబాద్‌,జూలై 31 (జనంసాక్షి): గనుల కుంభకోణంలోప్రధాన నిందితుడు,కర్ణటక మాజీ మంత్రి గాలి జనార్థన్‌ రెడ్డికి సంబం ధించిన’నగదుకు బెయిల్‌’ కేసు ముఖ్య నిందితుల్లో ఒకరైన బీజేపీ తిరుగు బాటు నేత,కెంప్లి ఎమ్మెల్యే టి హెచ్‌ సురేష్‌ బాబును ఏసీబీ అధికారులుసోమవారం కస్టడీలోకి తీసుకున్నారు. ‘నగదుకు బెయిల్‌’ కేసులోగాలి జానార్ధనరెడ్డి కి బెయిల్‌ మంజూర్‌ చేయడం కోసం అప్పటి జడ్జీలకు సురేష్‌,జనార్థన్‌ రెడ్డి సోదరుడు గాలి సోమ శేఖర్‌ రెడ్డి రూ.100 కోట్ల వరకూఇవ్వ జూపినట్లు ఆరోపణలు న్నాయి. ఈ కేసులో లంచం ఇవ్వడం కోసం వీరు ఎవరెవరిని కలిశారు?కుట్రలోఎంతమందిఉన్నారు.అనే అవశాలపై సురేష్‌ బాబును ఏసీబీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఈయనని ప్రశ్నించడంద్వారా చాలా నిజాలు బయటకు వస్తాయని ఏసీబీ గట్టి నమ్మకం ఉంది. జనార్ధనరెడ్డికి బెయిల్‌ కోసం మధ్య వర్తుల ద్వారా జడ్జీలకు భారీ మొత్తాలను లంచంగా ఇవ్వ జూపేందుకు గాలి సోమశేఖర్‌ రెడ్డి, సురేష్‌ బాబు చురుకైన. పాత్ర పోషించినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడయింది. వీరిద్దరి పైనా ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. విచారణకు రావాలంటూ ఏసీబీ అధికారుల నోటీసు అందుకున్న ఈ ఇద్దరు అజాతం లోకి వెళ్ళి పోగా, వీరి కోసం లుక్‌ అవుట్‌ నోటీసులను కూడా జారీ చేశారు.తర్వాత ఈ నిందితులిద్దరూ ముందస్తు బెయిల్‌ కోసం హైదరాబాద్‌ లోని ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ పెట్టుకున్నారు.ఈవిచారణ ఆగస్టు 1వ తేదీకి వాయిదా పడగా, కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీ న్యాయస్థానం నుంచి నోటీసులు వెళ్ళాయి.
ఇదిలా ఉండగా గాలి సోమ శేఖర్‌ రెడ్డిని అదుపులోకి తీసు కోవడం కోసం ఏసీబీ అధికార్లు ప్రత్యేక బృందాలను సిద్ధం చేసింది.ఈ బృందాలు బెంగుళూరు,బళ్ళారి ప్రాంతాలకు వెళ్ళినట్లు తెలిసింది. ముందస్తు బెయిల్‌ కోసం న్యాయ స్థానంలో వాదనలు ముగిసే లోపే వారిని పట్టుకోవడానినికి ఏసీబీ తీవ్రంగా ప్రయత్నింస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కూడా అయిన సోమ శేఖర్‌ రెడ్డి అరెస్టు కోసం అనుమతి అవసరం లేదని, అయానప్పటికీ ఆ రాష్ట్ర స్పీకర్‌కు తెలియజేస్తామని ఏసీబీ అధికారులు చెప్పారు. ఈయన ప్రజాప్రతినిధి అయినందువల్ల ఎక్కువ రోజులు తప్పించు కోలేరని, అరెస్టు అయితే మరిన్ని నిజాలు వెలుగు లోకి వస్తాయని అన్నారు. గాలి జనార్థన్‌రెడ్డి కి బెయిల్‌ మంజూరు కేసులో మాజీ జడ్జీలు పట్టాభి రామారావు,డి. ప్రభాకర్‌ రావు. కె లక్ష్మీ నరసింహారావు,పదవీ విరమణ చేసిన జడ్జీ టివి చలపతివావు, రౌడీ షీటర్‌ యాదగిరి రావు ,గాలి జనార్థన్‌ రెడ్డి బంధువు జి. దశరథరామిరెడ్డి తదితరులు ఏసీబీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు.