గిలానీపై అనర్హత వేటు వేసిన పాక్‌ సుప్రీంకోర్టు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధానమంత్రి యూసఫ్‌ రజా గిలానీపై ఆదేశ అత్యున్నత న్యాయస్థానం అనర్హత వేటువేసింది. ఈకేసును విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం గిలానీని వెంటనే తొలగించాలని అధ్యక్షుడు జర్దారీని ఆదేశించింది. గిలానీ స్థానంలో నూతన నియామకం చేపట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరింది. అధ్యక్షుడు జర్దారీ అవినీతి ఆరోపణలకు సంబంధించి గిలానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఆయనపై కోర్టు ధిక్కారణకేసు నమోదు చేసి శిక్ష విధించిన విషయం తెలిసిందే.