గుండుగీయించుకొని ఎమ్మెల్యే నిరసన

కైకలూరు: విద్యుత్‌ కోతలకు నిరసనగా కైకలూర్‌ ఎమ్మెల్యే వెంకటరమణ వినూత్న నిరసన చేపట్టారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలంటూ ఆయన కైకలూరు విద్యుత్‌సబ్‌ స్టేషన్‌ ఎదుట గుండు గీయించుకొని నిరసన చేపట్టారు. దానిని ప్రభుత్వం స్పందించి కోతలను ఎత్తి వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.