గుండెపోటుతో గొల్లపల్లి అంజయ్య మృతి

చేర్యాల మండలంలోని గుర్జకుంట గ్రామానికి చెందిన గొల్లపల్లి అంజయ్య (50) గుండెపోటుతో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. చేర్యాల పట్టణంలో నివాసముంటున్న అంజయ్యకు ఆదివారం గుండె నొప్పి రావడంతో చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.