గురజాడ గృహంలో వస్తువుల చోరీ

విజయనగరం, జూలై 17 : మహాకవి గురజాడ అప్పారావు స్వగృహంలో పలు వస్తువులు చోరీ అయినట్లు ఆలస్యంగా గుర్తించారు. వేదగిరి కమ్యూనికేషన్స్‌ ప్రతినిధి వి.రాంబాబు గురజాడ స్వగృహానికి అందజేసిన ఆరు సీలింగ్‌ ప్యాన్లలో ఒక ఫ్యాను, వాటర్‌ ఫిల్టర్‌, మూడు ప్లాస్టింగ్‌ కుర్చీలు చోరీకి గురయ్యాయి. దీంతో పలువురు సాహితీ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే గురజాడ ఇంటికి తగిన రక్షణ కల్పించాలని కోరారు.