గురుకుల కళాశాలల్లో దరఖాస్తకు నేడు తుది గడువు

చంద్రుగొండ, జిల్లాలోని మూడు ఆంద్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియేట్‌ ప్రధమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేంరుకు మంగళవారం ఆఖరు రోజు అని అన్నపురెడ్డిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్‌ తుమ్మల శివన్నారాయణ తెలిపారు.జిల్లాలో అన్నపు రెడ్డిపల్లి, దమ్ముపేల, పాల్వంచల్లో మూడు కళాశాలలున్నాయన్నారు. ఎంపీసీలో ఒక్కో కళాశాలలో 40 సీట్లు, బైపీసీలో ఒక్కో కళాశాలలో 40 సీట్లు ఉన్నాయన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ధరఖాస్తులు మంగళవారం సాయంత్రంలోపు పాన్వంచలోని గెరుకుల కళాశాలలో అందజేయాలన్నారు. జూన్‌ 14న కౌన్సెలింగ్‌ జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకొని విద్యార్ధులూ కౌన్సెలింగ్‌కు హజరుకావచ్చని ఆయన తెలిపారు. పదో తరగతిలో వచ్చిన గ్రేడ్‌లను ఆధారం చేసుకొని సీట్లు కేటాయిస్తారని చెప్పారు.