గురుకుల కళాశాల ప్రవేశాలకు 12వ తేదీ తుది గడువు

ఖమ్మం విద్యావిభాగం: ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక గురుకుల కళాశాలల్లో 2012-13వ విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కళాశాలల కన్వీనర్‌ సీహెచ్‌ అరుణకుమారి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ గురుకులాల్లో విద్యార్థులు, జిల్లా పరిషత్‌ పాఠశాలలో చదివిన ఎస్సీ విద్యార్థులు మాత్రవే అర్హులని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఇతర సామాజిక వర్గాలవారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు.ఆయా విద్యార్థులకు  తమకు వచ్చిన  పాఠ్యాంశాల  గ్రేడులను ఈ-సేవా కేంద్రాల ద్వారా తీసుకుని సమర్పించాలని సూచించారు. దరఖాస్తుదారులకు ఈ నెల 14న కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు.అదేరోజు విద్యార్థులు తమ ఒరిజినల్‌కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని వివరించారు.