గులాంనబీ ఆజాద్‌తో ముగిసిన సీఎం భేటీ

హైదరాబాద్‌: లేక్‌ వ్యూ అతిధి గృహంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ అజాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటన్నరకుపైగా ఆజాద్‌తో సీఎం చర్చించారు. రాష్ట్ర రాజకీయాలు, పర్టీ పరిస్థితి నామినేటెడ్‌ పదవులు, పాలనావ్యవహారాలపై సదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.