గోదావరి నది తీరాన అన్నదాన సత్రం
గోదావరి నది తీరాన అన్నదాన సత్రం ఏర్గట్ల మార్చి 30 (జనంసాక్షి) నిజాంబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తడపకల్ గ్రామంలో గురువారం గోదావరి ఘట్టున ఉన్న పుణ్యక్షేత్రమైన శ్రీరాముల వారి ఆలయంలో పూజలు నిర్వహించి శ్రీ సీతారాములకళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించి అనంతరం అన్నదాన సత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విడీసీ సభ్యులు మోహన్ రెడ్డి, బడిగిరి అనిల్, కుమ్మరి రమేష్, శంకర్, సాయన్న, దూదేకులరహీం,కటిక రమేష్, వడ్ల నారాయణ, తదితరులు పాల్గొన్నారు.