గోవులను తరలిస్తున్న లారీ స్వాధీనం
విజయవాడ,ఫిబ్రవరి16 జనంసాక్షి ): నగరంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను గోసంరక్షణ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. యూపీకి చెందిన రెండు కంటైనర్ లారీలో తమిళనాడుకు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని గోసంరక్షణ ప్రతినిధులు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు కంటైనర్ లారీలను పట్టుకున్నారు. దీంతో గోవులను తరలిస్తున్న వారు అక్కడి నుంచి పరారవగా, ఇద్దరు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గోవులను గోశాలకు తరలించారు.