గౌహతి ఘటనలో నిందితుల కోసం కొనసాగుతున్న గాలింపు

గౌహతి: అసోంలోని గౌహతి నగరంలో ఓ బార్‌ ముందు అందరూ చూస్తుండగానే మైనర్‌ బాలిక దుస్తులు చించివేసి లైంగింక వేధింపులకు పాల్పడిన ఘటనలో నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలించిన పోలీసులు 13 మందికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. వీరిలో నలుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న 9 మంది కోసం గాలింపు చేపట్టారు. సోమవారమే ఈ దుర్ఘటన చోటుచేసుకోగా యూట్యూబ్‌లో పెట్టిన వీడియోతో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఈ  ఘటనపై ముఖ్యమంత్రి తరుణ్‌గోగాయి విచారణ చేపట్టాల్సిందిగా అదనపు ముఖ్మ కార్యదర్శి ఇమిలీ దాన్‌ చౌదరిని ఆదేశించారు. 15 రోజుల్లో  నివేదిక సమర్పించాలని కోరారు. ఈ ఘటనసై జాతీయవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.