గ్యాస్ ధరలు తగ్గించాలంటూ హనుమకొండ జిల్లా కార్యదర్శి చిదురల సురేష్ నిరసన కార్యక్రమం నిర్వహించాడు

భీమదేవరపల్లి మండలం జులై
(6) జనంసాక్షి న్యూస్
యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు *శ్రీ బివి శ్రీనివాస్ మరియు రాష్ట్ర అధ్యక్షులు *శ్రీ శివసేన రెడ్డి  ఆదేశాల మేరకు వరంగల్ అర్బన్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *శ్రీ నల్లా ప్రతాప్ రెడ్డి మరియు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు *రేపల్లి రంగనాథ్* సూచనల ప్రకారం * యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి చిదురాల సురేష్ ఆధ్వర్యంలో ఈరోజు ముల్కనూరు అంబేద్కర్ కూడలి వద్ద  పెంచి ఎల్పిజి ధరలు తగ్గించాలంటూ NDA ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా చిదురాల సురేష్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను నిరంతరం పెంచుతూనే ఉందని,ఈరోజ ఎల్పిజి మళ్ళీ పెంచిందని ఇలాంటి పాలనను బీజేపీ నాయకులు అచ్చేదిన్ అంటున్నారు కాని యిది సచ్చేదిన్ అని వ్యాఖ్యానించారు.పెంచిన ఎల్పిజి ధరలను తగ్గించకుంటే రాబోయే రోజుల్లో ఈ NDA ప్రభుత్వానికి నరేంద్రమోదీ కి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల శాఖ ప్రధాన కార్యదర్శి మీస మహేష్  సీనియర్ నాయకులు మాట్లా మొగిలి రాకేష్ ప్రకాష్ జగన్ సుమన్ సిద్దు గణేష్ నగేష్ శశి సాయి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area