గ్రామాల వారిగా పంపిణీ

పరకాల: వ్యవసాయశాఖ ద్వారా లభించే సబ్సిడి పత్తి గింజలు పరకాల మండలానికి, 23 రెవెన్యూ గ్రామాలకు విడుదల అయినట్లు పరకాల వ్యవసాయశాఖ అధికారి మార్క దశరథం తెలిపారు.  శని వారం ఉదయం పరకాల వ్యవసాయశాఖ కార్యాలయములోని వ్యవసాయశాఖ అధికారి మార్క దశర థం సమక్షంలో జరిగిన సమావేశానికి మండలాధికారులు తహశీల్దార్‌ గీత, ఎంపీడీఓ శ్రీనాధ్‌ రావు, సీఐ కిరణ్‌కుమార్‌, స్పెషల్‌ అధికారులు రాజేంద్రప్రసాద్‌, అజారొద్దీన్‌పాటు వివిధ గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్న సమావేశంలో ప్రభుత్వం నుంచి రాయితీపై లభించే మహికో కంపెనీకి చెందిన నీరజ బ్రెంట్‌ పత్తి విత్తనాలను గ్రామాల వారిగా పత్తి సాగుచేసే రైతులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఈ పత్తి విత్తనాలను సోమవారం నుండి గ్రామ రెవెన్యూ అధికారితో పా టు పంచాయతి కార్యదర్శిలతో విత్తనాలను రైతులకు అందించాలని నిర్ణయించడమైందని తెలుపుతూ సోమవారం పులిగిల్ల, వరికోలు గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారి మార్క దశరథం, కంఠాత్మకూర్‌, రామక్రిష్టాపురం గ్రామాల్లో ఎంపీడీఓ శ్రీనాధ్‌రావు, నాగారం, మల్లక్కపేట గ్రామాల్లో ఇఓపీఆర్‌డి వెళ్లి పత్తి విత్తనాలను పంపిణీ చేస్తారని మార్క దశరథం తెలిపారు.