గ్రూప్‌ వన్‌ విడుదల

హైదరాబాద్‌: గ్రూప్‌ వన్‌ ప్రిలిమినరీ కీని ఏపీపిఎస్సీ విడుదల చేసింది. పేపరు బాగా రాసినా తాము ఎంపిక కాలేదని, మూల్యాంకనంలో లొసుగులవల్లే నష్టపోయామని కొందరు అభ్యర్థులు ఇటీవల ట్రిబ్యునల్‌ కోర్టును ఆశ్రయించారు. వారి ఆదేశాలతో కీని ఏపీపిఎస్సీ విడుదల చేసింది. ట్రిబ్యునల్‌కు సమర్పించిన నాలుగు సీరీస్‌ల కీని ఏపీపిఎస్సీ వెబ్‌సైట్లో ఉంచామని నిపుణుల కమిటీ సూచించిన విధంగానే సమాధానాలు ఇచ్చామని కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు.