-->

ఘనంగా ఎస్ఎల్వీఎస్ ఓకేషనల్ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని డిఐఈఓ జానపాటి కృష్ణయ్య , సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం , ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ అన్నారు.జిల్లా కేంద్రంలో పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో జరిగిన శ్రీ లక్ష్మీ వెంకట సాయి ఓకేషనల్ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం సాధించవచ్చునని  అన్నారు.జీవితంలో ఏది సాధించాలన్న చదువుతోనే సాధ్యమన్నారు.ప్రతి ఒక్కరి  జీవితాన్ని మలుపుతిప్పే  కళాశాల స్థాయి చదువును  నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.ప్రస్తుత సమాజంలో చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం ద్వారా భవిష్యత్ లో మంచి స్థాయిలో  స్థిరపడవచ్చునని చెప్పారు.అనంతరం గతేడాది ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ఈ వేడుకలలో కళాశాల కరస్పాండెంట్ కె.బాల గౌడ్ , చైర్ పర్సన్ విజయలక్ష్మి , ప్రిన్సిపాల్ కళ్యాణి , అనంతుల శ్రీనివాస్,లెక్చరర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.