ఘనంగా చిట్యాల చాకలి ఐలమ్మ 37 వర్ధంతి

సికింద్రాబాద్ (జనం సాక్షి )   చిట్యాల చాకలి ఐలమ్మ 37 వర్ధంతి  ఘనంగా నిర్వహించరు.   భూమి కోసం, భుక్తి, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణలో గ్రామ‌గ్రామాన సాగింది. రజాకార్ల అరాచకాలతో ఆగ్రహించిన ఎందరో త్యాగధనుల వీరోచిత పోరాటాలతో బానిస సంకెళ్లు తెంచుకున్నది. కౌలుకు తీసుకున్న భూమిలో కాపుకొచ్చిన పంటను కాజేయాలని పన్నాగం పన్నాడు. గూండాలను పురమాయించారు. తనకు వ్యవసాయమే ముఖ్యమని, దొర గడీలో వెట్టిచేయను పో అని గట్టిగా చెప్పింది. ఈ భూమినాది… పండించిన పంటనాది… తీసుకెళ్లడానికి దొరెవ్వడు… నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలింది. సంఘం కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. చాకలి ఐలమ్మ తెగువ.. సామాజికంగా దిగువ ఉన్న జనానికి ప్రేరణ, స్ఫూర్తినిచ్చింది. పల్లెపల్లెన ఉద్యమం ఎగిసిపడి, దొరల ఆధిపత్యం నేలమట్టమైంది. నైజాం వ్యతిరేక పోరాటానికి ఊపిరిలూదిన ఐలమ్మ 1985 సెప్టెంబర్‌ 10న ఊపిరి వదిలింది. ఈ కార్యక్రమం  అడ్డగుట్ట  యాభై పడకల హాస్పిటల్ దగ్గర చాకలి ఐలమ్మ అడ్డగుట్ట రజక సంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించి పండ్లు స్వీట్ పంచడం జరిగింది    పోలీస్ అధికారులు, ఫ్రెస్ వాళ్లు, మరియు కాలనీ వాసులు ఆనంద్ గారు   రజక సంఘం నాయకులు   ప్రెసిడెంట్ , నర్సింహ్మ వైస్,,ప్రెసిడెంట్,  గోపాల్  సెక్రటరీ  .స్వామి,     జాయింట్,సెక్రటరీలు, స్వామి,. నాగరాజు,  కిషన్, శ్రీను మిగితా సభ్యులు పాల్గొన్నారు.