ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్థంతి వేడుకలు.

డోర్నకల్ డిసెంబర్-06,జనంసాక్షి న్యూస్:భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా బుధవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పట్టణం అంబేద్కర్ కాలనీలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, అంబేద్కర్ జెండా ఆవిష్కరించిన మున్సిపల్ ఒకటో వార్డు కౌన్సిలర్ కొండేటి హేమచంద్రశేఖర్, అంబేద్కర్ అసోసియేషన్ సెక్రెటరీ అక్కల శంకర్, ప్రజాసంఘాల నాయకులు.అనంతరం వాళ్లు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని దేశం కోసం సామాజిక చైతన్యం మానవ హక్కుల పరిరక్షణకు బడుగు బలహీన వర్గాల చైతన్యానికి అభివృద్ధికి దారపోసారని అంబేద్కర్ చేసిన సేవలు ఉద్యమాలు మానవ చరిత్ర ఉన్నంత వరకు నిరంతరం ప్రజలు స్మరిస్తూనే ఉంటారని అన్నారు. కోట్లాదిమంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ మహనీయుని ఉద్యమ త్యాగాల స్ఫూర్తితో అన్యాయాలకు, అణిచివేతకు దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ సమ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల సూరి, కనకం జయేంద్ర, కొండేటి నందకిషోర్, దుప్పటి శీను,బండారి శ్రీను, కే నాగేష్,రాజు, కొండేటి వినయ్, నాగరాజు, కాజా,సునీల్ ,దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.