ఘనంగా దామోదరం సంజీవయ్య జయంతి

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 92వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పబ్లిక్‌ గార్డెన్స్‌ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతురావు, కంతేటి సత్యనారాయ  తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం నెక్లెస్‌ రోడ్డులోని దామోదరం సంజీవయ్య పార్క్‌లో ఉన్న ఆయన సమాధి వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశానికి, రాష్ట్రానికి సంజీవయ్య చేసిన సేవలను నేతలు ఈ సందర్భంగా కొనియాడారు.

తాజావార్తలు