ఘనంగా బీఆర్ అంబేద్కర్ జయంతీ ఉత్సవాలు
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డా|| బీఆర్ అంబేద్కర్ 123 వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి డిప్యూటి సీఎం దామోదర రాజనర్సింహా ,కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీప్యూటీ స్పికర్ మల్లు భట్టి విక్రమార్క ,మంత్రులు శైలాజానాథ్ ,గీతారెడ్డి పాల్గొన్నారు.


