ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
మునుగోడు ఆగస్టు20(జనంసాక్షి):మన మునుగోడు మన కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామాన జెండా కార్యక్రమం చెప్పటి తధానంతరం రాజీవ్ గాంధీ 79వ జయంతి వేడుకలను స్థానిక మండలంలోని శనివారం కొరటికల్ గ్రామంలో మందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,మునుగోడులో మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ జెండా ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క,మరియు విజయరమణారావులు మాట్లాడుతూ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలలో ముందుండి నడిపిన ఘనత రాజీవ్ గాంధీ ది అని కొనియాడారు వారి జయంతి వేడుకల సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో పండ్ల పంపిణీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో భాగంగా కొరటికల్ మరియు గూడపూర్ పులిపలుపుల గ్రామాలలో పండ్ల పంపిణీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో కేంద్ర మంత్రి రేణుక చౌదరి,టిపిసిసి అధికార ప్రతినిధి పున్న కైలాసనేత,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి మందుల సైదులు,మాజీ ఎంపీటీసీ పందుల భాస్కర్,పాల్వాయి చెన్నారెడ్డి, బొల్లం వెంకన్న ఇటుకలపాటి మధు రాజా భాస్కర్ మిర్యాల మధుకర్ తదితరులు ఉన్నారు.