ఘోర రోడ్డుప్రమాదంలో 14 మంది మృతి

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 14 మంది మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బిలాన్‌పూర్‌ గ్రామంలో చనిపోయిన ఓ మహిళ అంత్యక్రియల నిమిత్తం బంధువులు స్మశానానికి వెళ్లి ట్రాక్టర్‌లో తిరిగివస్తుండాగా ట్రాక్టర్‌ను ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో 14 మంది అక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన 15 మందిని సమీప ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.