చంద్రబాబు పర్యటన ప్రారంభం

చిత్తూరు: జిల్లాలో చంద్రబాబు రెండురోజుల  పర్యటన  ప్రారంభమైంది. ముందుగా కుప్పంలో పీఆఎస్‌ వైద్య కళాశాల పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఈ రోజు, రేపు ఆయన పర్యటిస్తారు అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యకర్తలను కలిసి వారి మనోభావాలను తెలుసుకోనున్నారు. పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటుపై ఆయన జిల్లా వ్యాప్తంగా సమీక్షించే అవకాశం ఉంది.